MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:39 pm Posted by : MANA TOLIVELUGU

రాజీవ్ గృహకల్పలో హైస్కూల్ ఏర్పాటు చేయాలి

మన తొలివెలుగు | హైదరాబాద్: అల్మాస్‌గూడలోని రాజీవ్ గృహకల్ప, వైఎస్సార్, జయశంకర్, ఆర్‌ఎంఆర్ కాలనీల సమస్యలను పరిష్కరించాలని సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు డిమాండ్ చేశారు. శనివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన బస్తీ దర్బార్‌లో డ్రైనేజీ, దోమల బెడద, బస్సు షెల్టర్ సమస్యలను ప్రజలు ప్రస్తావించారు. రాజీవ్ గృహకల్పలో హైస్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు అంబేద్కర్ చౌరస్తా–ఎల్బీనగర్ రింగ్‌రోడ్–బీఎన్‌రెడ్డి మార్గంలో ఆర్టీసీ బస్సులు నడపాలని కోరారు. కార్యక్రమంలో ఏర్పుల బాలస్వామి, కేవీ గౌడ్, సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.